ఈ నెల 14న దేవనకొండలో సర్వ సభ్య సమావేశం

ఈ నెల 14న దేవనకొండలో సర్వ సభ్య సమావేశం

KRNL: దేవనకొండ మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 14వ తేదీన జరగనుంది. ఈ సమావేశం ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించబడుతుందని ఆదివారం ఎంపీడీవో జ్యోతి తెలిపారు. మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని ఆమె పేర్కొన్నారు.