సత్తెనపల్లిలో రెడ్‌క్రాస్ కార్యవర్గ ప్రమాణస్వీకారం
PLD: సత్తెనపల్లి కళ్యాణమండపంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవలో రెడ్‌క్రాస్ పాత్ర విశేషమని ఎమ్మెల్యే తెలిపారు. .