వక్ఫ్ సవరణ చట్టం అమలు చేయం: మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలుచేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ముర్షిదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. తాను సీఎంగా ఉన్నంత కాలం ఈ చట్టం అమలు కాదని తేల్చి చెప్పారు. ఇటీవల తమ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు. స్థానికులు అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని సూచించారు.