అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత
BDK: ఇల్లందు మండలం బాలాజీ నగర్ ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలకు పోషక ఆహారం అందించడంలో మంచి గుణాలు అలవర్చడం లో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమన్నారు.