కమ్మవలసలో ఘనంగా శుద్ధ ఏకాదశి పూజలు
VZM: బొబ్బిలి మండలం కమ్మవలసలో కార్తీక మాసం శుద్ధ ఏకాదశి పూజలు శనివారం రాత్రి ఘనంగా జరిగాయి. గ్రామస్తులంతా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వసుంధర పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద మహిళల దీపారాధన చేశారు. స్వామి వారిని గ్రామంలో ఊరేగించారు.