VIDEO: ఎమ్మెల్యేకు చేదు అనుభవం
KMR: సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు చేదు అనుభవం ఎదురైంది. బేగంపూర్ తండాలో ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని నిలదీశారు. హామీలు నెరవేర్చిన తర్వాతే గ్రామంలో అడుగుపెట్టాలని మండిపడ్డారు. దీంతో ఆయన అక్కడినుంచి వెనుదిరిగారు.