'పోలీస్ వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలి'

KMM: పోలీస్ సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి జిల్లా పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేయాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఖమ్మం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వేచ్చ, స్వాతంత్ర వెనక ఎంతో మంది పోరాట యోధుల త్యాగం దాగి ఉందన్నారు.