మహా అద్భుతం.. అమ్మవారి విగ్రహానికి చెమటలు
KKD: కరప కాశీవారాహి అమ్మవారి విగ్రహానికి ఆదివారం ఉదయం చెమటలు పడుతున్నాయన్న వార్తతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ వింతను చూసి అర్చకుడు సుబ్బన్న విస్మయం వ్యక్తం చేశారు. ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. గ్రామస్థులు, మహిళలు తరలివచ్చి హారతులు ఇస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.