అక్రమ ఇసుక రవాణా.. రెండు లారీలు సీజ్

అక్రమ ఇసుక రవాణా.. రెండు లారీలు సీజ్

MDK: రామాయంపేట మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించి వాహనాలను సీజ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.