అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

అంగరంగ వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను ఆదివారం అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ తదితర పూజలు జరిపారు.