BREAKING: విమానంలో సాంకేతిక లోపం

TG: శంషాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాల్సిన అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం మూడుసార్లు రన్‌వే పైకి వెళ్లి తిరిగి వచ్చింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో జరిగింది. పైలట్ అప్రమత్తమై సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. విమానంలో తిరుపతికి వెళ్లాల్సిన 37 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.