22 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు

22 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు

RR: హయత్‌నగర్ పాత గ్రామంలోని శ్రీ చక్ర సహిత మహమయి రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉందని పేర్కొన్నారు.