కలెక్టరేట్ వద్ద దళిత సంఘాలు నిరసన

కలెక్టరేట్ వద్ద దళిత సంఘాలు నిరసన

కోనసీమ: పీ. గన్నవరం(మం) కుందాలపల్లిలో ఇటీవల జరిగిన కుల వివక్ష ఘటనపై దోషులను అరెస్ట్ చేయాలని కోరుతూ.. దళిత సంఘాలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టాయి. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు.