ఆలపాటిని గెలిపించాలని కోరిన కూటమి

కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తిరువూరు సమైక్య ప్రెస్ క్లబ్‌లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 5 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్స్ అందరూ కూటమి బలపరిచిన ఆలపాటి రాంజేంద్రప్రసాద్‌ను గెలిపించాలని కోరారు.