అద్భుతమైన ప్రతిభను కనబరిచిన విద్యార్థి
BDK: నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో అశ్వాపురం మండలానికి చెందిన విద్యార్థిని బొడ్డుపల్లి అక్షయ శ్రీ అద్భుత ప్రతిభ కనబరిచారు.హైదరాబాద్ లోని శ్రీ వశిష్ట జూనియర్ కళాశాలలో ఎంపీసీ విభాగంలో విద్యనభ్యసించిన ఆమె, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 987 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఈమె తండ్రి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.