యూరియా పంపిణీపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

NLG: జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి యూరియా పంపిణీపై వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని సూచించారు.