భక్తిశ్రద్ధలతో కడ్లే గౌరమ్మ రథోత్సవ వేడుకలు

భక్తిశ్రద్ధలతో కడ్లే గౌరమ్మ రథోత్సవ వేడుకలు

ATP: విడపనకల్లు మండల కేంద్రంలో శనివారం కడ్లే గౌరమ్మ రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తాదులు పెద్ద ఎత్తున ఈ రథోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై ఖాజా హుస్సేన్ తెలిపారు.