ఉచిత వైద్య శిబిరం

ఉచిత వైద్య శిబిరం

KNR: సైదాపూర్ మండలంలోని పెరికపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం గ్రామ సర్పంచ్ పోతరాజు బబిత ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 350 మందికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్య విషయాల్లో అవగాహన కలిగి ఉండాలని ఆమె కోరారు.