ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి ఉగాది శుభాకాంక్షలు

ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి ఉగాది శుభాకాంక్షలు

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరికి అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు. తెలుగు వారి కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకున్నట్లు పేర్కొన్నారు. షడ్రురుచుల వలె అన్ని రంగాల ప్రజలు కలిసిమెలసి ఉండాలని, ప్రకృతి అనుకూలించి రైతులతో పాటు ఉద్యోగ వ్యాపార అన్నిరంగాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు.