పాశమైలారం ఘటన ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

KMM: పాశమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. పరిశ్రమలోని రియాక్టర్ భారీ విస్పోటనం కారణంగా ఏర్పడిన పరిస్థితులు, శిథిలాలు, పరిశ్రమ సముదాయాన్ని పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు.