చిన్న వయసులోనే పెద్ద ఆలోచన
HYD: ఉప్పల్ నియోజకవర్గంలో ఇడపాక సిశిరా తన పుట్టినరోజు సందర్భంగా అమ్మకు చేతి గడియారం, నాన్నకు హెల్మెట్‌ను దాచుకున్న డబ్బులతో కొనిచ్చి అందరి మనసులను గెలుచుకుంది. తల్లిదండ్రులపై ప్రేమతో, భద్రతపై బాధ్యతతో ఇచ్చిన ఈ బహుమతులను ఆమె తల్లిదండ్రులు సునీత, సురేష్ ప్రశంసించారు. అనంతరం సిశిరాకు బంధువులు, స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.