కోఠిలో మహిళలకు హెల్మెట్ల పంపిణీ

HYD: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమంతో పాటు వారి రక్షణ కోసం పాటుపడుతుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదివారం కోఠిలో మహిళలకు హెల్మెట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ఎంతో విజయవంతమవుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు.