'విద్యుత్ ఆర్టిజన్ కర్మికులను పర్మినెంట్ చేయాలి'
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ షేక్ గయాజుద్దీన్ కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు.