కులగణనను స్వాగతిస్తున్నాం: షర్మిల

కులగణనను స్వాగతిస్తున్నాం: షర్మిల

AP: కేంద్రం ఎట్టకేలకు దేశవ్యాప్తంగా కులగణనకు ఒప్పుకున్నట్లు ప్రకటించిందని, కాంగ్రెస్ తరపున స్వాగతిస్తున్నామని APCC చీఫ్ షర్మిల అన్నారు. ఇది సాధ్యం అయ్యిందంటే.. రాహుల్ గాంధీనే కారణమన్నారు. కులగణన జరగాలని ఎప్పటి నుంచో రాహుల్ డిమాండ్ చేస్తున్నారని, BCల నుంచి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. కులగణన జరిగితే ఆర్థికంగా అన్ని కులాల వారికి మేలు చేసేలా సాయం చేయవచ్చని పేర్కొన్నారు.