భక్తుల కొంగు బంగారంగా కొండ పోచమ్మ ఆలయం

భక్తుల కొంగు బంగారంగా కొండ పోచమ్మ ఆలయం

సిద్దిపేట జిల్లాలో ఉన్న శ్రీ కొండపోచమ్మ దేవాలయం భక్తుల కొంగు బంగారంగా పరిడ విల్లుతోంది. గ్రామ దేవతగా పూజించే అమ్మవారు ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం ప్రకృతి సోయగాలతో కూడిన విశిష్టమైన ప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. కొండ పోచమ్మ రిజర్వాయర్ సమీపంలో ఉండడం వల్ల భక్తులకు సరస్సు చుట్టూ ఉన్న పచ్చని కొండలు, స్వచ్ఛమైన గాలి భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది.