ఘనంగా కాళోజీ 23వ వర్ధంతి వేడుకలు

ఘనంగా కాళోజీ 23వ వర్ధంతి వేడుకలు

వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఎస్పీ బాలుర వసతి గృహంలో గురువారం తెలంగాణ ఉద్యమకారుడు కాళోజి నారాయణరావు 23వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వసతి గృహ సంక్షేమ అధికారి సత్యనారాయణ యాదవ్ విద్యార్థులతో కలిసి కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. కాళోజి ప్రజల పక్షాన, తెలంగాణ కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.