'ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
NDL: దొర్నిపాడు మండల ప్రజలు భానుడికి గురి కావద్దని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. దొర్నిపాడులో 39.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని పేర్కొన్నాడు. వాతావరణ శాఖ అధికారుల సమాచారం మేరకు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ చల్లని మజ్జిగ లాంటి పానీయాలు తీసుకుంటూ ఆరోగ్యాలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.