పురమిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి: కమిషనర్

W.G: ఆకివీడు నగర పంచాయతీలో పౌరులు మరిన్ని సేవలు పొందేందుకు పురమిత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషనర్ కృష్ణమోహన్ తెలిపారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు ఈ యాప్ ప్రవేశపెట్టిందన్నారు. సమస్యలు ఈ యాప్ ద్వారా నమోదు చేసుకునేందుకు వాటి స్థితిగతులను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపకరిస్తుందన్నారు.