గ్రేహౌండ్ జవాన్‌కు నివాళులు అర్పించిన మంత్రి

గ్రేహౌండ్ జవాన్‌కు నివాళులు అర్పించిన మంత్రి

కామారెడ్డి: పాల్వంచ మండల కేంద్రానికి చెందిన వడ్ల‌‌‌ శ్రీధర్ నక్సల్స్ మందుపాతరకు బలైన విషయం తెలిసిందే. స్వగ్రామానికి చేరిన మృతదేహానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించి, వారి తల్లి, భార్యను ఓదార్చారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ఉన్నారు.