ప్రిన్సిపాల్‌కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్

ప్రిన్సిపాల్‌కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్

వరంగల్: జిల్లా కేంద్రంలోని లాల్ బహదూర్ శాస్త్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆవరణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధా నేడు ఆందోళన నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీప్రసాద్ కొద్దిరోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సదరు ప్రిన్సిపాల్‌పై తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆమె నినాదాలు చేశారు.