ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ల ప్రచారాలు

ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ల ప్రచారాలు

BHNG: రామన్నపేట మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల పెంపునకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ సీ. జగదీష్ ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి, కళాశాల ప్రత్యేకతలను వివరించారు. ఉచిత ఇంటర్ విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్, స్కాలర్‌షిప్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.