వరంగల్ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు

WGL: పహల్గామ్‌లో జరిగిన దాడి నేపథ్యంలో సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు చేశారు. రైల్వే పోలీసులు ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేసారు. భద్రత చర్యలో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు రైల్వే సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఎవరైన అనుమానితులు కనిపిస్తే తక్షణమే రైల్వే పోలీసులకు తెలపాలని ప్రయాణీకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.