అకాలవర్షం.. తడిసిన వరిధాన్యం

అకాలవర్షం.. తడిసిన వరిధాన్యం

TG: కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. టేక్రియాల్, లింగాపూర్, దేవునిపల్లిలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. అకాలవర్షంతో వరిధాన్యం కుప్పలు తడిచిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. బీబీపేట మండలం తుజాల్పూర్‌లో పిడుగుపాటుతో నలుగురు రైతులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.