సున్నిపెంటలో వ్యక్తి మృతి.. హైదరాబాద్ వాసిగా గుర్తింపు
NDL: సున్నిపెంట వైన్ షాప్ సమీపంలో హైదరాబాద్కు చెందిన కలిదిండి సాయి శ్రీకాంత్ అనే వ్యక్తి మృతి చెందాడు. వైన్ షాప్ వద్ద పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు అతన్ని లేపేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెంది ఉన్నాడు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆధార్ కార్డు ఆధారంగా అతన్ని హైదరాబాద్ వాసిగా గుర్తించారు.