ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి 'సంకల్ప్' ప్రణాళిక అమలు
AP: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు 'సంకల్ప్-2026' కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 20 వరకు 50 రోజుల ప్రణాళికను అమలు చేయనుంది. డిసెంబరు 15 నుంచి 20 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, డిసెంబరు 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.