డుంబ్రిగూడ పైవీధిలో వరద నీరు సమస్య
ASR: తుపాన్ ప్రభావం తగ్గిపోయినా డుంబ్రిగూడ పైవీధిలో వరద నీరు సమస్య మాత్రం కొనసాగుతోంది. వీధులన్నీ చిన్న చిన్న వాగులుగా మారిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వరద నీరు ప్రవహిస్తున్నా, దానికి దారి మళ్లించే చర్యలు అధికారులు తీసుకోవడం లేదని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.