పేకాట శిబిరంపై దాడి

AKP: ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు గ్రామ శివారులో మంగళవారం పేకాట శిబిరంపై ఎస్సై విభూషణరావు దాడులు చేపట్టారు. ఈ మేరకు ఐదుగురిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ.6400 నగదు, 52 పేక ముక్కలను స్వాదీనం చేసుకున్నారు. అనంతం కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.