అంబేద్కర్ ఆశయాలు దీపపు స్తంభాలు: ఎమ్మెల్యే రవికుమార్.
SKLM: అంబేద్కర్ ఆశయాలు దీపపు స్తంభాలని ఆముదాలవలస నియోజకవర్గ MLA కూన రవికుమార్ పేర్కొన్నారు. శనివారం అంబేద్కర్ 69వ వర్ధంతికార్యక్రమం ఆముదాలవలస మండలకేంద్రంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సిద్ధాంతాలు సమాజాన్ని నిరంతరం ముందుకు నడిపిస్తాయని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆలోచనలను కార్యరూపంలో ఉంచిన నాడే నిజమైన నివాళులన్నారు.