కొల్లిపాడులో ఘోర అగ్నిప్రమాదం.. రూ. 20 లక్షలు ఆస్తి నష్టం
శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలం కొల్లిపాడు వంశధార కాలువ వద్ద ఉన్న ధూపాన భాస్కరరావు ఇంట్లో శనివారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో సుమారు 20 లక్షలు ఆస్తి నష్టం సంభవించింది. మైక్ సెట్ లైటింగ్ ఏసీలు ఆంఫిల్ ఫైర్, టెంట్ హౌస్ షామియానాలు దగ్ధమయ్యాయి. కోటబొమ్మాళి అగ్నిమాపక కేంద్రానికి చెందిన ఫైర్ ఇంజన్ హుటాహుటిన వచ్చి మంటలు అదుపు చేశారు.