ఫూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

ఫూలే చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవిభక్త భారతదేశంలో అంటరానితనం, అణచివేత, సామాజిక రుగ్మతలపై పోరుసల్పిన తొలినాటి యోధుడు జ్యోతిరావు ఫూలే అని ఎమ్మెల్యే రాము అన్నారు. నందివాడ మండలం రామాపురంలో ఇవాళ జరిగిన ఫూలే వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే, కూటమి నాయకులు నివాళులర్పించారు.