VIDEO: స్నేహితురాలిగా నమ్మించి ఇంట్లో భారీ చోరీ
NZB: నగరంలో స్నేహితురాలిగా నమ్మించి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన ఓ మహిళ పోలీసులకు చిక్కింది. తెలిసిన అమ్మాయి కదా అని ఇంట్లోకి రానిస్తే, డూప్లికేట్ తాళం చేయించి ఇంట్లో లేని సమయంలో గాయత్రి అనే మహిళ డబ్బులు దొంగిలించింది. వాటితో పాటు 18 తులాల బంగారం, కిలో వెండి, కొంత నగదు అపహరించింది. ఇంట్లో తరచూ డబ్బుల పోతుండటంతో యజమాని అమర్చిన స్పై కెమెరాలో ఈ దొంగతనం రికార్డయింది.