జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు
PPM: వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సాలూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జెవి.ఎస్.ఎస్.ఎస్ ప్రసాద్ తెలిపారు. మన్యం జిల్లా డీటీవో ఆదేశాల మేరకు సాలూరులో రహదారి భద్రతా వారోత్సవాలను శనివారం చేపట్టారు. క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.