కృష్ణ బ్రిడ్జి వద్ద వ్యక్తి మృతదేహం లభ్యం
NRPT: కృష్ణ మండలంలోని కృష్ణ బ్రిడ్జి సమీపంలో 45 ఏళ్ల నల్లె నాగప్ప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 2 రోజుల క్రితం మాగనూరులో ఆయన స్పృహ తప్పి పడిపోయినట్లు సమాచారం. మృతుడు జక్లేర్ గ్రామ నివాసిగా తేలడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తమ్ముడు నల్లె కురుమయ్య ఫిర్యాదుతో ఎస్ఐ నవీద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.