ఏలూరులో నేడు గృహ ప్రవేశాలు
ఏలూరు జిల్లాలో పీఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద నేడు 1,160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేస్తున్నట్లు కలెక్టర్ కే.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో పీఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 82,443 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేసినట్లు, వాటిలో ఇప్పటివరకు 45,089 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందించినట్లు చెప్పారు. మరో 1,160 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.