పంజాబ్ విజయం.. గర్వంగా ఉంది: ప్రీతి జింటా
చెన్నైపై పంజాబ్ సాధించిన అద్భుత విజయం పట్ల ఆ జట్టు ఓనర్ ప్రీతి జింటా హర్షం వ్యక్తంచేసింది. ప్రయాణంలో ఉండటంతో మ్యాచ్ చూడలేకపోయానని చెప్పిన ఆమె.. టీమ్ మరోసారి 200+ స్కోర్ ఛేజ్ చేసిన తీరు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య, కెప్టెన్ అయ్యర్, ప్రభ్‌సిమ్రాన్, కూపర్ & టీమ్ అద్భుతంగా ఆడారని.. సమష్టి కృషితో విజయం సాధించారని ప్రశంసించింది.