పంచాయతీ ఎన్నికల వేడి.. ఓటర్లకు చికెన్, మద్యం పంపిణీ
BDK: గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇంటింటికీ టీ, టిఫిన్లు, మధ్యాహ్నం అరకిలో చికెన్, రాత్రికి మద్యం పంపిణీ చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు తమను గెలిపిస్తే గ్రామంలో వినాయక, దుర్గామాత విగ్రహాలు సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపానికి రూ. 10 వేలు అందిస్తామని హామీలు ఇస్తున్నారు.