ఆక్రమంగా ఎర్రమట్టి తరలిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

ఆక్రమంగా ఎర్రమట్టి తరలిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

ATP: అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. బుక్కరాయసముద్రం మండలంలో తనిఖీలు నిర్వహించి 17 ట్రాక్టర్లు, 3 టిప్పర్లు, 3 జేసీబీలు, 4 హిటాచీలు సహా 27 వాహనాలపై కేసు నమోదు చేశామన్నారు. రూ. 2.65 లక్షల జరిమానా విధించారు. అక్రమ రవాణాపై ప్రజలు సమాచారం అందించాలని కోరారు.