'చెత్త కుప్పలు ఎక్కడా కనిపించకూడదు'
AKP: చెత్త కుప్పలు ఎక్కడా కనిపించకూడదని కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. గురువారం స్థానిక మేజర్ పంచాయతీలో పారిశుధ్యం పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పారిశుధ్య కార్మికులు రోజు చెత్తను తొలగించి సంపద కేంద్రానికి తరలించాలన్నారు. గ్రామ పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయించాలన్నారు.