స్వామివారి కళ్యాణానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

KKD: ఈనెల 7న జరిగే అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణానికి రావాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు ఆహ్వాన పత్రం అందజేశారు. ఆదివారం సాయంత్రం జగ్గంపేటలోని స్థానిక రావులమ్మ నగర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వానించారు.