నవాబుపేట మండలంలో డెంగ్యూ కేసు నమోదు

నవాబుపేట మండలంలో డెంగ్యూ కేసు నమోదు

MBNR: నవాబుపేట మండలం తీగలపల్లి గ్రామంలో ఒక బాలుడు డెంగ్యూ బారిన పడినట్టు వైద్యాధికారి శ్రావణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తుండగా ఈ కేసు బయటపడింది అన్నారు. దోమల నివారణ కోసం గ్రామంలో దోమల మందు పిచికారి చేసినట్టు పేర్కొన్నారు. గ్రామస్తులంతా కూడా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.